Dachepalli: గామాలపాడులో జంగా కృష్ణమూర్తి రాస్తారోకో.. నిలిచిన వాహనాలు
Dachepalli: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడులో మాజీ ఎమ్మెల్సీ, టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాస్తారోకో; అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై నిలిచిన వాహనాలు.
Dachepalli: గామాలపాడులో జంగా కృష్ణమూర్తి రాస్తారోకో.. నిలిచిన వాహనాలు
దాచేపల్లి: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గ్రామాలపాడులో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్సీ, టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి తన అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎన్నికలు సానుకూల వాతావరణంలో, ప్రశాంతంగా జరగాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, కాసు మహేష్‌రెడ్డి కలయిక నశించాలంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. అలాగే ‘డౌన్ డౌన్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు’ అంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు.
జంగా కృష్ణమూర్తి, ఆయన అనుచరులు రహదారిపై బైఠాయించడంతో అద్దంకి–నాలుగేటిపల్లి జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామాలపాడులో చోటుచేసుకున్న ఈ పరిణామాలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.




