Macherla: మాచర్ల 23వ వార్డులో రేపు రీపోలింగ్: కమిషనర్ గోపాల్!
Macherla: పల్నాడు జిల్లా మాచర్ల 23వ వార్డులోని 23/1, 23/2 బూతుల్లో బూత్ క్యాప్చరింగ్ జరిగినట్లు అధికారులు నివేదిక ఇవ్వడంతో సోమవారం రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
Macherla: మాచర్ల 23వ వార్డులో రేపు రీపోలింగ్: కమిషనర్ గోపాల్!
మాచర్ల: మాచర్ల పట్టణంలోని 23 వార్డులో రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 23/1,23/2 రెండు బూతుల్లో క్యాప్చరింగ్ జరిగినట్లు పల్నాడు జిల్లా అధికారులు రాష్ట్ర ఎన్నికల అధికారులకు నివేదించడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేపు పోలింగ్ నిర్వహిస్తున్నట్టు మాచర్ల పట్టణ కమిషనర్ గోపాల్ తెలిపారు.




