Palnadu: చిలకలూరిపేటలో బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం!

Palnadu: పల్నాడు చిలకలూరిపేటలో బాణసంచా దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో యజమాని సురేష్ మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి; హవాయి కాల్చడం వల్లే ప్రమాదం జరిగింది.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 19 Sept 2026 7:37 AM IST
Palnadu
X

Palnadu: చిలకలూరిపేటలో బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం!

Palnadu: చిలకలూరిపేటలో బొప్పూడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం ప్రమాదంలో దుకాణ యజమాని సురేష్ మృతి, మరో వ్యక్తి మస్తాన్‌కు స్వల్ప గాయాలు

దుకాణం ముందు హవాయి లాంటి బాణసంచా కాల్చడం వల్లే అగ్నిప్రమాదం జరిగిందని పల్నాడు జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎస్. శ్రీధర్ వెల్లడి రాత్రి 8:20 గంటలకు సమాచారం అందడంతో వాటర్ జెట్స్ సాయంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు

దుకాణం నిర్వహణకు ఏడాది క్రితం తీసుకున్న ప్రొవిజనల్ పర్మిషన్ మాత్రమే ఉందని అధికారులు తెలిపారు ఘటనా స్థలాన్ని ఫైర్ డీజీ పి.వి. రమణ, అడిషనల్ డైరెక్టర్ జ్ఞానసుందరం తదితర ఉన్నతాధికారులు పరిశీలించారు

ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందిన సురేష్‌ను డీఎస్పీ హనుమంతరావు పరిశీలించారు గాయపడిన మస్తాన్‌ను పరామర్శించిన డీఎస్పీ, కుటుంబ సభ్యులతో మాట్లాడారు ప్రమాదానికి దారితీసిన కారణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తామని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA