Palnadu: పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు.. అప్రమత్తమైన పోలీసులు!

Palnadu: పల్నాడు జిల్లాలో కుండపోత వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతితో అమరావతి-విజయవాడ, సత్తెనపల్లి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

VENKATESWARA RAO,	PEDAKURAPADU
Published on: 25 Sept 2026 11:18 AM IST
Palnadu
X

Palnadu: పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు.. అప్రమత్తమైన పోలీసులు!

Palnadu: అమరావతి, పెదకూరపాడు లలో రాత్రి అంతా కుండపోత వర్షం పొంగి ప్రవహిస్తున్న వాగులు,వంకలు. పొలాల్లోనికి చొచ్చుకుపోయిన వరద నీరు. లో లెవెల్ చప్టాలపై నుండి రహదారిపైకి ప్రవహిస్తున్న వరద నీరు

పెదమద్దూరు బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పైనుండి ప్రవహిస్తున్న వరద నీరు అమరావతి -విజయవాడ మధ్య నిలిచిన రాకపోకలు పరస-కంభంపాడు మధ్య లో లెవెల్ చప్టాపై భారీగా వరద ప్రవాహం నిలిచిన రాకపోకలు.

విజయవాడ మరియు అమరావతి మధ్య వరద ప్రవాహంతో నిలిచిపోయిన రాకపోకలు. అంతేకాకుండా సత్తెనపల్లి అమరావతి మధ్య కూడా నిలిచిపోయిన రాకపోకలు. వరద ప్రవాహంతో బ్రిడ్జిల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు.

VENKATESWARA RAO,	PEDAKURAPADU

VENKATESWARA RAO, PEDAKURAPADU