Vinukonda: వినుకొండ పోలీస్ స్టేషన్‌లను తనిఖీ చేసిన పల్నాడు ఎస్పీ జగదీష్

Vinukonda: పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి వినుకొండ పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి కేసుల పురోగతి, రికార్డులను పరిశీలించారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 3 Oct 2026 9:18 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండ పోలీస్ స్టేషన్‌లను తనిఖీ చేసిన పల్నాడు ఎస్పీ జగదీష్

వినుకొండ: నూతనంగా బాధ్యతలు చేపట్టిన పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి వినుకొండ పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లను శనివారం సందర్శించారు.సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను సందర్శిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా స్టేషన్లలోని వివిధ రికార్డులు, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తు ఏ దశలో ఉందనే అంశాలపై సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

స్టేషన్లలో రికార్డుల నిర్వహణ, కేసుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.అనంతరం పోలీస్ సిబ్బంది పనితీరు, హాజరు వివరాలను పరిశీలించిన ఎస్పీ.. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, నిర్వహణపై కూడా ఆరా తీశారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

ప్రజలు పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులతో వచ్చినప్పుడు వారి సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఫిర్యాదుదారులకు మెరుగైన సేవలు అందించి, ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని మరింత పెంచాలని సూచించారు.

శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి స్పష్టం చేశారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA