Vinukonda: వినుకొండ మున్సిపల్ ఎన్నికల భద్రతపై ఎస్పీ జగదీష్ సమీక్ష!

Vinukonda: వినుకొండ మున్సిపల్ ఎన్నికల బందోబస్తుపై పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ సమీక్ష. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు వెల్లడి.

KAREEMULLA, VINUKONDA
Published on: 1 Nov 2026 7:14 AM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండ మున్సిపల్ ఎన్నికల భద్రతపై ఎస్పీ జగదీష్ సమీక్ష!

Vinukonda: వినుకొండ మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి తెలిపారు.

ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించిన ఆయన మాట్లాడుతూ.. వినుకొండ మున్సిపాలిటీ పరిధిలోని సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దించి నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు.ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు.

ఓటు వేసిన వెంటనే పోలింగ్ కేంద్రాల వద్ద గుమిగూడకుండా ప్రశాంతంగా తమ ఇళ్లకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా, గొడవలకు దిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలోనే కాకుండా ఎన్నికల అనంతరం కూడా ఎలాంటి ఘర్షణలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి వినుకొండ మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ కోరారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA