Palnadu: దాచేపల్లిలో విషాదం: నల్లబోతుల వెంకటేశ్వర్లు కన్నుమూత!

Palnadu: పల్నాడు దాచేపల్లిలో టీడీపీ నేత నల్లబోతుల వెంకటేశ్వర్లు మృతి. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, రెండు కిలోమీటర్లకు పైగా పాడె మోసిన ఎమ్మెల్యే యరపతినేని.

SK SAIDA, GURAJALA
Published on: 22 Sept 2026 8:25 AM IST
Palnadu
X

Palnadu: దాచేపల్లిలో విషాదం: నల్లబోతుల వెంకటేశ్వర్లు కన్నుమూత!

Palnadu: గురజాల నియోజకవర్గం, దాచేపల్లి టౌన్ లోని 5వ వార్డు నందు అనారోగ్య కారణాలతో మరణించిన కాపు సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు దాచేపల్లి మండల తెలుగుదేశం పార్టీ మాజీ కన్వీనర్ కీర్తిశేషులు నల్లబోతుల వెంకటేశ్వర్లు (చిన్నా) గారి మృతదేహనికి గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.

నల్లబోతుల వెంకటేశ్వర్లు గారు 1994 నుండి యరపతినేని గారి వెన్నంటి ఉండి, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. వెంకటేశ్వర్లు గారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటి నుంచి పలుమార్లు యరపతినేని గారు వారిని పరామర్శించడం జరిగింది. వెంకటేశ్వర్లు గారు 2 సార్లు (1994 నుండి) దాచేపల్లి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గా మరియు 1999 లో పిడుగురాళ్ల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా పనిచేశారు.

పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన కీర్తిశేషులు నల్లబోతుల వెంకటేశ్వర్లు (చిన్నా) గారి రుణం తీర్చుకుంటూ వారి పాడెను యరపతినేని శ్రీనివాసరావు గారు రెండు కిలోమీటర్లకు పైగా మోసి, అంత్యక్రియల్లో పాల్గొనడం జరిగింది.

SK SAIDA, GURAJALA

SK SAIDA, GURAJALA