Vinukonda: ఈపూరులో ఎంపీటీసీ నామినేషన్ల వేళ ఉద్రిక్తత: వైసీపీ ఆరోపణలు!

Vinukonda: పల్నాడు జిల్లా ఈపూరులో ఎంపీటీసీ నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ అభ్యర్థులపై దాడులు చేసి నామినేషన్ పత్రాలు లాక్కున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 22 Oct 2026 10:21 PM IST
Vinukonda
X

Vinukonda: ఈపూరులో ఎంపీటీసీ నామినేషన్ల వేళ ఉద్రిక్తత: వైసీపీ ఆరోపణలు!

వినుకొండ: వినుకొండ నియోజకవర్గం,ఈపూరు మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా ఘర్షణ చోటుచేసుకున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని వారు పేర్కొన్నారు.

బొగ్గరం, కొండాయపాలెం గ్రామాలకు చెందిన అభ్యర్థుల చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలను కొందరు వ్యక్తులు లాక్కొని వెళ్లిపోయారని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఇనిమెళ్ల గ్రామానికి చెందిన చెవుల అంకారావు ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వెళుతుండగా ఆయనపై దాడి చేసి, నామినేషన్ పత్రాలను లాక్కెళ్లినట్లు తెలిపారు.

ఈ ఘటనలో గాయపడిన అంకారావును చికిత్స నిమిత్తం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన ఆరోపణలపై పోలీసుల నుండి వివరణ రావాల్సి ఉంది.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA