Parchur: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు రాఖీలు కట్టిన డ్వాక్రా మహిళలు
Parchur: పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కలిసి డ్వాక్రా మహిళలు, కుటుంబ సభ్యులు రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
Parchur: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు రాఖీలు కట్టిన డ్వాక్రా మహిళలు
పర్చూరు: రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు డ్వాక్రా మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సనాతన సంప్రదాయ పద్ధతిలో రాఖీలు కట్టి, ఎమ్మెల్యే సాంబన్న ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు, అక్కాచెల్లెళ్లు సైతం ఎమ్మెల్యేకు ఆప్యాయంగా రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య అనురాగం, ఆత్మీయతకు రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సోదర సోదరీమణుల అనుబంధం మరింత బలపడటంతో పాటు సమాజంలో ప్రేమ, ఐకమత్యం, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. మానవ సంబంధాలు, నైతిక విలువలు, పరస్పర గౌరవాన్ని పెంపొందించే గొప్ప పర్వదినం రక్షాబంధన్ అని ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు.




