Parchur: గుంటూరు ఛానల్ పొడిగింపులో రాజీపడే ప్రసక్తే లేదు

Parchur: గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించే విషయంలో ఎలాంటి రాజీ లేదని, రైతులు అపోహలు వీడాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 28 Aug 2026 11:01 PM IST
Parchur
X

Parchur: గుంటూరు ఛానల్ పొడిగింపులో రాజీపడే ప్రసక్తే లేదు

పర్చూరు: గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు.

ఏడు దశాబ్దాల కలను సహకారం చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.ఛానల్‌ విస్తరణతో నియోజకవర్గంలోని సుమారు 28 వేల ఎకరాలకు సాగునీటితో పాటు ప్రజలకు తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.

ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ,ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. గుంటూరు ఛానల్‌ పర్చూరు వరకు తీసుకురావడం ద్వారా రైతులకు శాశ్వతంగా నీటి భరోసా కల్పిస్తామని పేర్కొన్నారు.

ఈ విషయంలో రైతులు అపోహలకు గురికావద్దని ఎమ్మెల్యే ఏలూరి స్పష్టం చేశారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story