Bapatla: ఎదుబాడు ఎస్సీ కాలనీలో రూ. 28 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం!
Bapatla: పర్చూరు మండలం ఎదుబాడు ఎస్సీ కాలనీ ప్రజల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రూ.28 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు.
Bapatla: ఎదుబాడు ఎస్సీ కాలనీలో రూ. 28 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం!
Bapatla: ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముందుకు సాగుతున్నారు. పర్చూరు మండల పరిధిలోని ఎదుబాడు గ్రామం ఎస్సీ కాలనీ ప్రజల వినతికి స్పందించిన ఎమ్మెల్యే ఏలూరి రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు.
ఎస్సీ కాలనీలో అధ్వానంగా ఉన్న రహదారితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో రాకపోకలకు అవస్థలు పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే ఏలూరి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల సమస్యను పరిశీలించిన ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దీంతో రూ.28 లక్షల వ్యయంతో పీఐయూ (PIU) ఆధ్వర్యంలో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు.
రహదారి నిర్మాణంతో ఎస్సీ కాలనీ ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగనున్నాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, రైతులు, కూలీలు, వాహనదారులకు సౌకర్యం కలగనుంది. తమ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.




