Martur: త్రాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక కార్యాచరణ: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
Martur: వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా సాగర్ జలాలతో చెరువులను నింపాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధికారులను ఆదేశించారు.
Martur: త్రాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక కార్యాచరణ: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
మార్టూరు: వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. సాగర్ జలాలను నియోజకవర్గంలోని అన్ని చెరువులకు మళ్లించి వాటిని నింపేందుకు ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందులో భాగంగా యద్దనపూడి, గన్నవరం, పోలూరు తదితర ప్రాంతాల్లోని చెరువులను ఎమ్మెల్యే ఏలూరి శుక్రవారం పరిశీలించారు. చెరువుల్లోకి చేరుతున్న నీటి పరిస్థితిని, సాగర్ జలాల ప్రవాహాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రాజుపాలెం మేజర్ వద్ద సాగర్ నీటి ప్రవాహాన్ని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే.. నీరు ఏ మేరకు వస్తోంది, చెరువులకు తరలించే అవకాశాలు, అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. రాజుపాలెం మేజర్ పరిధిలో దర్శి , నాగరాజు పల్లి, మార్టూరు, రాజుపాలెం, జోన్నతాలి, కొణిదెన చెరువులను పూర్తిస్థాయిలో నింపాలని అధికారులు ఆదేశించారు.
సాగర్ జలాలు అందుబాటులో ఉన్నప్పుడే వాటిని సద్వినియోగం చేసుకుని చెరువులను నింపాలని, తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టిన ఉపయోగం లేదన్నారు.గ్రామాల్లో త్రాగునీటి సమస్యకు ఆస్కారం లేకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని ఎన్ఎస్పీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఏలూరి స్పష్టం చేశారు. నీటి లభ్యత, చెరువుల సామర్థ్యం, సరఫరా మార్గాలను సమన్వయం చేసుకుని ప్రణాళికబద్ధంగా నీటిని మళ్లించాలని సూచించారు. ఎక్కడైనా నీటి ప్రవాహానికి అడ్డంకులు ఉంటే వెంటనే గుర్తించి తొలగించాలని ఆదేశించారు.
ప్రతి చెరువులో జలకళ కనిపించాలి
పర్చూరు నియోజకవర్గంలోని చెరువులన్నీ సాగర్ జలాలతో కళకళలాడేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు. ప్రజల త్రాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి నిర్వహణ చేపట్టాలని సూచించారు. నీటి ఎద్దడి పరిస్థితులు ఏర్పడిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే అవసరమైన చర్యలు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.




