Chilakaluripet: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ప్రాణదాతలుగా నిలిచిన యువత!
Chilakaluripet: చిలకలూరిపేటలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు చరణ్ తేజ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, 200 యూనిట్ల రక్తం సేకరణ.
Chilakaluripet: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ప్రాణదాతలుగా నిలిచిన యువత!
Chilakaluripet: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని చిలకలూరిపేట లోని గ్రాండ్ వెంకటేశా హాలులో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా కొనసాగింది.
జనసేన యువనేత మండలనేని చరణ్ తేజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సేవా కార్యక్రమానికి ప్రజలు, యువత నుంచి విశేష స్పందన లభించింది. మధ్యాహ్నం 12:30 గంటల సమయానికే 200 మందికి పైగా రక్తదానం చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.
రక్తదానం చేయడానికి దాతలు ఇంకా భారీగా తరలివస్తుండటంతో శిబిరం వద్ద సందడి నెలకొంది. తమ ప్రియతమ నాయకుడి పుట్టినరోజున ప్రాణదాతలుగా నిలవడం గర్వకారణమని పేర్కొంటూ జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు సాయంత్రం నాలుగు గంటల దాకా ఈ రక్తదాన శిబిరం కొనసాగింది.ఈ సందర్భంగా రక్తదాతలను మండలనేని చరణ్ తేజ ప్రత్యేకంగా అభినందించారు.




