Guntur: సినిమా చూపిస్తూ మెదడుకు శస్త్ర చికిత్స చేసిన వడ్లమూడి డీవీసీ హాస్పిటల్ వైద్యులు
Guntur: గుంటూరు జిల్లా వడ్లమూడి డీవీసీ హాస్పిటల్‌లో అరుదైన అవేక్ క్రానియాటమీ (మెలకువగా ఉంచి చేసే బ్రెయిన్ సర్జరీ) విజయవంతమైంది.
Guntur: సినిమా చూపిస్తూ మెదడుకు శస్త్ర చికిత్స చేసిన వడ్లమూడి డీవీసీ హాస్పిటల్ వైద్యులు
గుంటూరు: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలోని డివిసి హాస్పిటల్ లో అరుదైన శాస్త్ర చికిత్స జరిగింది. వివరాలోకి వెళ్తే 45 సంవత్సరాల వయస్సు గల కోటేశ్వరమ్మ అపస్మారక స్థితి మరియు ఫిట్స్ రావడంతో వడ్లమూడి డీవీసీ హాస్పిటల్‌లో చేరింది వైద్య పరీక్షలు,
ఎమ్మారై స్కానింగ్ అనంతరం మెదడులోని కీలకమైన భాగానికి సమీపంలో గడ్డ (ట్యూమర్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ట్యూమర్ ఉన్న ప్రదేశం శరీర కదలికలు మరియు ఇతర ముఖ్యమైన మెదడు పనితీరును నియంత్రించే ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో, రోగి న్యూరోలాజికల్ ఫంక్షన్లను కాపాడేందుకు Awake Craniotomy చేయాలని నిర్ణయించారు
ఈ విధానంలో రోగి మెలకువలో ఉండగానే శస్త్రచికిత్స నిర్వహిస్తారు. శస్త్రచికిత్సకు ముందు రోగి ప్రముఖ నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని వైద్య బృందం తెలుసుకుంది. దీంతో ఆమెకు ఎంతో ఇష్టమైన “OG” సినిమా ప్రదర్శిస్తూ, ఆమెను ప్రశాంతంగా ఉంచుతూ శస్త్రచికిత్సను ప్రారంభించారు.
శస్త్రచికిత్స సమయంలో రోగి సినిమా చూస్తూ ఉండగా, వైద్యులు ఆమెతో నిరంతరం మాట్లాడిస్తూ, సూచించిన విధంగా చేతులు, కాళ్లు కదిలించమని చెబుతూ మెదడు పనితీరును పరిశీలించారు. ఈ విధంగా మెదడులోని సున్నితమైన భాగాలకు ఎటువంటి హాని కలగకుండా అత్యంత జాగ్రత్తగా ట్యూమర్‌ను తొలగించారు.
ఈ అరుదైన Awake Brain Tumor Surgeryకి ప్రముఖ న్యూరోసర్జన్ డా. పద్మనాభుని అరుణ్ కుమార్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా డీవీసీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర మరియు మేనేజింగ్ డైరెక్టర్ ధూళిపాళ్ల జ్యోతిర్మయి వైద్య బృందాన్ని అభినందించారు.




