Uppalapadu: ఉప్పలపాడులో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహణ!

Uppalapadu: ఉప్పలపాడులో పొలం పిలుస్తోంది కార్యక్రమం. ప్రతి రైతు 11 అంకెల ఫార్మర్ ఐడీ కలిగి ఉండాలని గుంటూరు ADA మోహన్ రావు పిలుపు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 16 Sept 2026 6:00 PM IST
Uppalapadu
X

Uppalapadu: ఉప్పలపాడులో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహణ!

Uppalapadu: పెదకాకాని మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంకు గుంటూరు సబ్ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ N. మోహన్ రావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ ఐడి నెంబర్ కలిగి ఉండాలని తెలిపినారు. ప్రతి పౌరునికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో, ప్రతి రైతుకి ఈ 11 అంకెల ఫార్మర్ ఐడి అంత ముఖ్యమని తెలిపారు. రాబోయే రోజుల్లో వ్యవసాయానికి సంబంధించిన పలు కార్యక్రమాలు ఫార్మర్ ఐడి ద్వారానే నిర్వహింస్తు నట్లు తెలిపారు.

ఈ ఫార్మర్ ఐడి కనుక లేకపోతే రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు చేయటం, అలానే పీఎం కిసాన్ నగదు ఇలాంటివన్నీ ఆగిపోయే అవకాశం ఉంది కావున ప్రతి రైతు సంబంధిత రైతు సేవా కేంద్రమునకు వెళ్లి ఫార్మర్ ఐడి పొందగలరని తెలిపినారు. తరువాత ప్రభుత్వం కొత్తగా రైతులకు తెచ్చిన ఏపీ ఎయిమ్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని వ్యవసాయానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు.

వరి పంటలో వచ్చు తెగుళ్లు, పురుగులు గురించి వివరించారు, ముఖ్యంగా వరిలో భాశ్వరం ఎరువులు పై పాటుగా వేయ వద్ధని తెలిపారు, వరిలో వచ్చు అగ్గితేగులు, పాముపొడ తెగులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు,ఈ కార్యక్రమంలో స్థానిక మండల వ్యవసాయ అధికారి రమణ కుమార్ మాట్లాడుతూ ఇప్పుడు వేసిన పంట మొత్తాన్ని ఈ క్రాప్ బుకింగ్ ద్వారా పంట నమోదు చేయించుకోవాలని తెలిపినారు.

ఇప్పటికే రైతులకు ఈ క్రాప్ బుకింగ్ 95 శాతం పూర్తి అయినది అని,ఆ మిగిలిన ఐదు శాతం మంది రైతులు కూడా త్వరగా ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలని తెలిపినారు,ఎవరైనా వైతులు అపరాలు వేసేటట్లయితే సబ్సిడీ మీద అపరాలు విత్తనాలు ఇస్తామని తెలిపారు,తరువాత వరి పొలాలలో ఏమైనా చీడపీడలు ఉన్నాయని తెలుసుకోవడానికి ఉప్పలపాడు గ్రామంలోని పలు పొలాలను పరిశీలించడం జరిగినది, ఈ కార్యక్రమంలో స్థానిక నీటి సంఘం అధ్యక్షులు బూసి బాబు అలానే పిఎసిఎస్ ప్రెసిడెంట్ మైలా సుబ్బారావు, రామకృష్ణ, సూర్యనారాయణ ,పెద్ది కృష్ణ మరియు ఆదర్శ రైతులు పాల్గొన్నారు, తర్వాత ఉప్పలపాడు, తక్కెలపాడు గ్రామంలోని ఎరువుల షాప్స్ మరియు PACS లను తనిఖీ చేసి, ఎరువుల నిల్వలను, రిజిస్టర్లను, ఈ పోష్ మిషన్ లోని నిల్వలను ప గోడౌన్ లోని నిల్వలను పరిశీలించినారు.రైతులకు ఎటువంటి ఎరువుల కోరతలేదని వ్యవసాయ ఆదికారులు తెలిపారు, ఈ కార్యక్రమంలో గ్రామ ఆదర్శ రైతులు, aeo శివరావు మరియు RSK సిబ్బంది రాకేష్, ప్రియాంక పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN