Pedanandipadu: తాగునీటి కోసం పెదనందిపాడు ఎంపీడీవో ఆఫీస్ వద్ద ధర్నా
Pedanandipadu: ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడులో తాగునీటి కోసం ఎంపీడీవో ఆఫీస్ ఎదుట గ్రామస్తుల నిరసన. చెరువులో నీళ్లు నింపాలని, కలుషిత నీటితో రక్షించాలని డిమాండ్.
Pedanandipadu: తాగునీటి కోసం పెదనందిపాడు ఎంపీడీవో ఆఫీస్ వద్ద ధర్నా
పెదనందిపాడు: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్ ఎదురు గ్రామస్తులు నీరు కోసం ఆందోళన చేపట్టారు.
గత రెండు సంవత్సరాల నుండి ఈ చెరువును బాగు చేయండి. ఈ చెరువుకు నీళ్లు నింపండి అని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకోవటం లేదని అంతేకాకుండా ఈరోజు చెరువుకి త్రాగునీరు ఎప్పుడు పెడతారని అడగటానికి వస్తే ఎంపీడీవో ఆఫీసులో కనీసం అధికారులు కూడా ఎవరూ లేరు. నీటి సమస్యను తీర్చకపోతే మేము రాస్తారోకోలుకైన, సిద్ధమని అధికారులు హెచ్చరించారు.
అడుగంటిన చెరువు నీళ్లు కుళాయిలో వస్తుంటే. చర్మవ్యాధులతో బాధపడుతున్నామని అనేక రోగాలతో చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారని వారు మండిపడ్డారు. ఎప్పుడైనా ఎండాకాలంలో నీటి ఎద్దడి ఉండేవి. కానీ వర్షాకాలంలో నీటి ఎద్దడి రావడం అధికారులు నిర్లక్ష్యం అని ఈ ఆందోళన కి కారణం ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యలు తీర్చకపోతే ఆందోళనకు సిద్ధం హెచ్చరించారు.




