Guntur: గుంటూరు జిల్లాలో పీజీఆర్ఎస్ తాత్కాలిక రద్దు.. కలెక్టర్!

Guntur: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) తాత్కాలికంగా రద్దు చేసినట్లు గుంటూరు కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 16 Nov 2026 7:55 AM IST
Guntur
X

Guntur: గుంటూరు జిల్లాలో పీజీఆర్ఎస్ తాత్కాలిక రద్దు.. కలెక్టర్!

Guntur: ఎన్నికల విధులలో జిల్లా యంత్రాంగం నిమగ్నం కావడం వలన మరియు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటం వలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి పూర్తి అయ్యేవరకు పి.జి.ఆర్.ఎస్ ను రద్దు చేయడం జరిగిందని చెప్పారు. ఈ అంశాన్ని ప్రజలు గమనించి సోమవారం వ్యయప్రయాసలకు ఓర్చి రావద్దని విజ్ఞప్తి చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN