Guntur: అన్ని కార్యాలయాల్లో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహణ!

Guntur: గుంటూరు జిల్లాలో సోమవారం అన్ని కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్ నిర్వహణ.. టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా ఆర్జీల వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ వెల్లడి.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 20 Sept 2026 2:31 PM IST
Guntur
X

Guntur: అన్ని కార్యాలయాల్లో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహణ!

Guntur: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)ను సోమవారం జిల్లా, మండల స్థాయిలో అన్ని కార్యాలయాల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. మీ కోసం వెబ్ సైట్ లోను ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

పి.జి.ఆర్.ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 1100 కు ఫోన్ చేసి ఆర్జీల వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. ప్రజలు నేరుగా సోమవారం నిర్వహిస్తున్న పి.జి.ఆర్.ఎస్ లో అర్జీలు సమర్పించవచ్చని లేదా మీ కోసం వెబ్ సైట్ Meekosam.ap.gov.in(మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) లో కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పి.జి.ఆర్.ఎస్ కు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1100 ను వినియోగించుకొని, ఆర్జీల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని సూచించారు. క్యూఆర్ కోడ్ ద్వారా స్పందన తెలియజేయవచ్చని చెప్పారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN