Bapatla: చీరాలలో పోలీసుల కార్డన్ సెర్చ్: పత్రాలు లేని వాహనాలు సీజ్!
Bapatla: బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ పరిధిలోని విజిలిపేటలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టి, సరైన పత్రాలు లేని 4 ఆటోలు, 38 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
Bapatla: చీరాలలో పోలీసుల కార్డన్ సెర్చ్: పత్రాలు లేని వాహనాలు సీజ్!
Bapatla: బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మహమ్మద్ మోహిన్ సూచనలతో చీరాల సబ్ డివిజన్ పరిధిలోని విజిలిపేటలో ఆదివారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. చీరాల ఒకటో పట్టణ, రెండో పట్టణ సీఐల ఆధ్వర్యంలో, ఆరుగురు ఎస్ఐలు 65 మంది పోలీసు సిబ్బందితో కార్డన్ సెర్చ్ చేపట్టారు.
ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని నాలుగు ఆటోలు, 38 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజిలిపేటలో గంజాయి విక్రయాలు, వినియోగం, అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఒకటో పట్టణ సీఐ హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించాలని సూచించారు.
అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించడం ద్వారా తమ ప్రాణాలను రక్షించుకోవచ్చని పోలీసులు అవగాహన కల్పించారు. యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.




