Chilakaluripet: యడ్లపాడులో ఫ్లెక్సీల రాజకీయ వేడి.. వైసీపీ vs కూటమి వార్!
Chilakaluripet: పల్నాడు జిల్లా యడ్లపాడులో వైఎస్సార్‌సీపీ, కూటమి నేతల మధ్య ఫ్లెక్సీల వార్ రసవత్తరంగా మారింది.
Chilakaluripet: యడ్లపాడులో ఫ్లెక్సీల రాజకీయ వేడి.. వైసీపీ vs కూటమి వార్!
చిలకలూరిపేట: వైఎస్సార్ వర్ధంతి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా యడ్లపాడు మండలంలో వెలిసిన ఫ్లెక్సీలు రాజకీయ చర్చకు దారితీశాయి, వైసీపీ అభిమానుల ఫ్లెక్సీల్లో “2029లో మళ్లీ సీఎం జగనన్నే వస్తారు.. మీకు చేతనైతే ఆపండి” అంటూ సవాల్ విసిరిన సందేశాలు.
దీనికి కౌంటర్‌గా కూటమి అభ్యర్థుల ఫ్లెక్సీల్లో “రాడు.. రానీయం” అంటూ ప్రతిస్పందన, ఒకే ప్రాంతంలో పరస్పర సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో స్థానికంగా ఆసక్తికర చర్చ, దీంతో యడ్లపాడు మండల గ్రామంలో ఫ్లెక్సీలు రాజకీయ ఆటబిగా మారి, స్థానికంగా హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఫ్లెక్సీల రూపంలో మొదలైన రాజకీయ వేడి ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.




