Guntur: జైల్లో పరిచయం.. బయట చోరీలు: ఇద్దరు నిందితుల పట్టివేత!
Guntur: జైల్లో పరిచయమై ఏపీ, తెలంగాణల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
Guntur: జైల్లో పరిచయం.. బయట చోరీలు: ఇద్దరు నిందితుల పట్టివేత!
గుంటూరు: గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని షరాఫ్ బజార్లో గత నెల 29వ తేదీన ఓ గృహంలో చోరీ జరగడంతో బాధిత కుటుంబీకులు పొన్నూరు అర్బన్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాపట్ల జిల్లా అప్పికట్ల గ్రామానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగ వంశీకృష్ణ.
సంగారెడ్డి జైలులో పరిచయమైన కడప జిల్లాకు చెందిన అనిల్ కలసి చోరీకి పాల్పడినట్లు గుర్తించడంతో వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 53 గ్రాముల బంగారు ఆభరణాలు, అరకేజీ వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకొని కోర్టులో ప్రవేశపెట్టినట్లు అర్బన్ సీఐ కిషోర్ కుమార్ తెలియజేశారు, ఈ కేసుని సవాల్ గా స్వీకరించి త్వరితన నిందితులను అదుపులోకి తీసుకోవడం పట్ల ఉన్నతాధికారులు పోలీస్ సిబ్బందిని అభినందించారని సిఐ కిషోర్ కుమార్ తెలిపారు.




