Ponnur: వైఎస్సార్ వర్ధంతి.. ఘనంగా నివాళులర్పించిన డా. రూతు రాణి!
Ponnur: పొన్నూరు పట్టణం, చింతలపూడిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన వైసీపీ నాయకురాలు డాక్టర్ నల్లమోతు రూతు రాణి.
Ponnur: వైఎస్సార్ వర్ధంతి.. ఘనంగా నివాళులర్పించిన డా. రూతు రాణి!
Ponnur: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పేదల పెన్నిధి, దివంగత మహానేత, డాక్టర్" వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి" సందర్భంగా వైయస్ఆర్సీపీ పొన్నూరు పట్టణ మరియు మండలం చింతలపూడి గ్రామంలో నేడు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్" మాజీ పొన్నూరు పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్" నల్లమోతు రూతు రాణి.
ఈ సందర్భంగా వైఎస్సార్ ముఖ్యమంత్రిగా అందించిన సంక్షేమ పాలనను, పేదలు–బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్సార్ సేవలు, స్ఫూర్తి ఎప్పటికీ మరువలేనివి గుర్తు చేసుకుని, ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, డక్కమళ్ళ రవి, పొన్నూరు మండల పార్టీ అధ్యక్షులు చింతలపూడి మురళీకృష్ణ,
పొన్నూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు పాల్ రాజు, అంబటి వెంకటేశ్వరావు, అన్నవరపు శ్యామల, రుద్రపాటి మేరీ, వాసు మళ్లీ సరళ, డక్కుమళ్ళ సంధ్య, బొనిగల నాగార్జున, ఎం రాజశేఖర్, చింతలపూడి వైఎస్ఆర్సిపి యువజన విభాగం నాయకులు పాల్గొని, స్వీట్లు పంపిణీ చేసి, ఆయనకు ఘనమైన వాళ్లు అర్పించారు.




