Ponnuru: పొన్నూరులో రూ.90 లక్షలతో జలజీవన్ మిషన్ పనులు
Ponnuru: పొన్నూరు మండలం మామిళ్ళపల్లిలో రూ.90 లక్షలతో జలజీవన్ మిషన్ తాగునీటి పథకానికి ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు.
Ponnuru: పొన్నూరులో రూ.90 లక్షలతో జలజీవన్ మిషన్ పనులు
పొన్నూరు: పొన్నూరు మండలంలోని మామిళ్ళపల్లి గ్రామంలో పల్లెపండుగ 3.O కార్యక్రమంలో భాగంగా జలజీవన్ మిషన్ పథకానికి శ్రీకారం చుట్టటం జరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, రక్షిత తాగునీటిని అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'జలజీవన్ మిషన్' పథకం కింద ₹90.00 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న తాగునీటి ప్రాజెక్టుకు ఈరోజు ఘనంగా శంకుస్థాపన చెయ్యటం జరిగింది.
గ్రామంలో కొత్తగా తాగునీటి ట్యాంక్ (Overhead Tank) నిర్మాణం, పైప్‌లైన్ వ్యవస్థ విస్తరణ మరియు ఇంటింటికీ మంచి నీటిని అందించనున్నారు.
"కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న జలజీవన్ మిషన్ ద్వారా తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ , కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు




