Ponnuru: రూ. 32 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Ponnuru: పొన్నూరులో రూ. 32 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు. అమరావతిపై దుష్ప్రచారం ఖండించారు.
Ponnuru: రూ. 32 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పొన్నూరు: గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో 32 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత 200 సంవత్సరాల కాలంలో కురిసిన వర్షపాతాన్ని పరిగణలోకి తీసుకొని రాజధాని నిర్మాణం చేస్తున్నామని 22 వేల క్యూసెక్కుల కు పైగా నీటిని బయటకు పంపించే విధంగా పంపిణీ వ్యవస్థను నిర్మించడం జరిగిందన్నారు.
కొందరు కావాలని రాజధాని అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని అమరావతిలో ఎంత వర్షం కురిసిన ఇటువంటి ఇబ్బంది లేదన్నారు. ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తాగునీటి వ్యవస్థను మరింత మెరుగుపరుస్తున్నామన్నారు.
అమృత్ 2.0 కింద ప్రతి ఒక్కరికి మంచినీరు అందించే విధంగా పైప్ లైన్ నిర్మాణం వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టినట్లు,హ్యామ్ ప్రాజెక్ట్ కింద పట్టణాల అభివృద్ధికి నిధులను కేటాయిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.




