Ponnuru: పొన్నూరు TDP ఆఫీస్‌లో డాక్టర్ అబ్దుల్ కలాం వర్ధంతి
Ponnuru: పొన్నూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కూటమి నాయకులు, కార్యకర్తలు.
Ponnuru: పొన్నూరు TDP ఆఫీస్‌లో డాక్టర్ అబ్దుల్ కలాం వర్ధంతి
పొన్నూరు: పొన్నూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
దేశ అభివృద్ధికి, ముఖ్యంగా యువతకు డాక్టర్ కలాం అందించిన సేవలను నాయకులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన చూపిన మార్గం, క్రమశిక్షణ, దేశభక్తి, శాస్త్రసాంకేతిక రంగంలో చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ మండల, టౌన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




