Prathipadu: ప్రత్తిపాడులో 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత!
Prathipadu: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు కాటూరి హాస్పిటల్ సమీపంలో 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం. వాహనం సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు అప్పగించిన అధికారులు.
Prathipadu: ప్రత్తిపాడులో 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత!
Prathipadu: అక్రమంగా తరలిస్తున్న సుమారు 30 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. ప్రత్తిపాడు మండలంలోని కాటూరి హాస్పిటల్ సమీపంలో శనివారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ పట్టివేత జరిగింది.
విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్తిపాడు డిప్యూటీ తహసీల్దార్ శివశంకర్, గుంటూరు వెస్ట్ పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ బేగ్ సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. సందర్భంగా AP 07 TM 1542 నంబరు గల వాహనంలో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి బియ్యంతో సహా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
Next Story




