Prathipadu: ఆగస్టు 5న ప్రియదర్శిని కాలేజీలో మెగా జాబ్ మేళా
Prathipadu: వట్టిచెరుకూరు ఐదో మైలు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో ఈనెల 5న జాబ్ మేళా. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ప్రత్తిపాడు MLA పిలుపు.
Prathipadu: ఆగస్టు 5న ప్రియదర్శిని కాలేజీలో మెగా జాబ్ మేళా
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం ఐదో మైలు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల ఐదో తారీకు జరగబోయే జాబ్ మేళా జయప్రదం చేయండి.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మలినేని ఇంజనీరింగ్ కాలేజ్ కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీల్లో గతంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది.
అదేవిధంగా ఇప్పుడు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలు సంపాదించాల్సిందిగా స్థానిక శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు తెలియజేయడం జరిగింది.
Next Story




