Chilakaluripet: చంద్రబాబు పాలనతోనే ప్రత్యర్థులకు సమాధానం!
Chilakaluripet: అభివృద్ధి, సుపరిపాలనతోనే ప్రత్యర్థులకు చంద్రబాబు సమాధానం చెప్తున్నారని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్య. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని ధీమా.
Chilakaluripet: చంద్రబాబు పాలనతోనే ప్రత్యర్థులకు సమాధానం!
Chilakaluripet: విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన ఇన్‌చార్జ్ తోట రాజారమేశ్, కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి తోట రాజరాజేశ్వరి వ్యాఖ్యలు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యాంశాలు. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిన జగన్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురైంది. 53 రోజుల నిర్బంధం అనంతరం 2023 అక్టోబర్ 31న చంద్రబాబు విడుదలై నేటికి మూడేళ్లు పూర్తయ్యాయి.
చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో చిలకలూరిపేట టీడీపీ శ్రేణులు రాష్ట్రంలోనే గుర్తుండిపోయే పోరాటం చేశాయి. జాతీయ రహదారిపై సుమారు రెండు గంటల పాటు లాఠీఛార్జీని సైతం లెక్కచేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడారు. జగన్ అరాచక పాలన, నియంతృత్వ పోకడల నుంచే నేటి కూటమి ఆవిర్భవించింది.
2024 ఎన్నికల్లో కూటమికి ప్రజలు భారీ మెజారిటీ అందించడానికి జగన్ పాలనా విధానాలే ప్రధాన కారణం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాజకీయ కక్షసాధింపులకు పాల్పడకుండా అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది, 2021 స్థానిక ఎన్నికల్లో వైసీపీ నాయకులు టీడీపీ అభ్యర్థులను సంతలో పశువులను కొన్నట్లు కొనుగోలు చేశారు.
తమ మాట వినని వారిపై తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేశారు. చిలకలూరిపేటలో గత వైసీపీ పాలకులు అరాచకాలు, అధికార దుర్వినియోగం, రౌడీయిజం సంస్కృతిని తీసుకొచ్చారు. గతంలో చేసిన దుర్మార్గాలకు సమాధానం చెప్పుకోలేకే వైసీపీ నాయకులు గుంటూరుకు పారిపోయారు. వైసీపీ ఒక డ్రామా కంపెనీ అని, స్థానిక వైసీపీ నాయకురాలు తన నటనతో విధి నిర్వహణలో ఉన్న ఎస్సైని బలిచేశారని ప్రత్తిపాటి విమర్శించారు.
వైసీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి షేక్ కరీమున్, ఆమె భర్త యూసఫ్ అలీ స్వచ్ఛందంగా టీడీపీలో చేరారు. తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజాబలంతోనే గెలుస్తామని, దౌర్జన్యాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చిలకలూరిపేట మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జనసేనకు కేటాయించిన మున్సిపాలిటీల్లో ప్రజాదరణ పరంగా చిలకలూరిపేట మొదటి స్థానంలో ఉందని తెలిపారు.
తోట రాజరాజేశ్వరి ముఖ్యాంశాలు. చిలకలూరిపేట ప్రజలు ప్రచారంలో చూపిన ఆదరణను పోలింగ్‌లోనూ చూపించాలని కోరారు. తనను ఇంటి ఆడబిడ్డగా ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తమ జీవితాలను ప్రజాసేవకే అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. తోట రాజారమేశ్ ముఖ్యాంశాలు చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించడం గత వైసీపీ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదమని అన్నారు. 2014-19 మధ్య ప్రత్తిపాటి పుల్లారావు నాయకత్వంలో నియోజకవర్గానికి సుమారు రూ.4,500 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారని తెలిపారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ ప్రత్తిపాటి నాయకత్వంలో మరో అభివృద్ధి అధ్యాయం ప్రారంభమైందన్నారు. చిలకలూరిపేట మున్సిపాలిటీని జనసేనకు కేటాయించి ప్రజాసేవకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటితో కలిసి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రజల రుణం తీర్చుకుంటామని స్పష్టం చేశారు.




