Guntur: ఖరీఫ్ సాగు గట్టెక్కేనా వర్షాల కోసం ఎదురుచూస్తున్న ప్రత్తిపాడు రైతాంగం
Guntur: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆశించిన రీతిలో వర్షాలు కురవక ఎండిపోతున్న పంటలు. కష్టాల్లో అన్నదాతలు, గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు.
Guntur: ఖరీఫ్ సాగు గట్టెక్కేనా వర్షాల కోసం ఎదురుచూస్తున్న ప్రత్తిపాడు రైతాంగం
Guntur: ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రతిపాడు, వట్టి చెరుకూరు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పడిన అరకుర వర్షాలు ఆధారంగా దుక్కి పనులు చేపట్టారు. వర్షాలను గురించి స్థితిగతులను గుర్తించి దశల వారీగా నాట్లు వేసే పనిలో పడ్డారు. అయితే ఈ ప్రాంతాల్లోని కొంతమంది రైతులకు ఎటువంటి సాగునీటి సమస్యా లేనప్పటికీ, మరి కొంతమంది రైతులకు వర్షం ఆధారంగా నాట్లు వేసే వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
నియోజకవర్గ వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో సుమారుగా 70 వేల హెక్టార్లలో వివిధ పంటలు రైతులు సాగు చేస్తారు. కాకుమాను మండలం లో మెరుగ్గా ఖరీఫ్ సాగు. 50 శాతం వరి నాట్లు పూర్తి పెదనందిపాడు ప్రత్తిపాడు వట్టిచెరుకూరు మండలంలో నీరు అందుబాటులో లేకపోవడంతో ఎక్కువ శాతం ఆడుదల పంటలు సాగు చేస్తారు ఇప్పటికే కొంతమంది రైతులు జులై నెలలో కురిసిన కొద్దిపాటి వర్షాలకుపత్తిని సాగు చేశారు.
జూలై రెండవ వారం నుండి వరుడు కరుణించకపోవడంతో వేసిన పత్తి మొక్క ఎదుగుదల లేక జిటక పారిపోయింది మొలిచిన మొక్కలను బతికించుకునేందుకు రైతులు సమీపంలోని నీళ్లు తీసుకుని వచ్చి మొక్కలు పోస్తున్నారు. ఇది ఇలా ఉంటే వర్షాలు కురవాలని ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున గ్రామ దేవతలకు నీళ్లు పోసి మొక్కులు తీర్చుకుంటున్నారు.
గత వారం రోజులుగా ఆకాశం మీద మేఘమృతమై అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడుతున్నాయి, ఈ వర్షం వల్ల మొక్కలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులు సైతం సూచనలు సలహాలు అందిస్తున్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదని రైతులు వాపోతున్నారు.




