Ponnur: పంచభూతాల కాన్సెప్ట్‌తో రెల్లి కమిటీ వినూత్న గణపతి!
Ponnur: పొన్నూరు రైల్‌పేటలో రెల్లి కమిటీ ఆధ్వర్యంలో పంచభూతాల కాన్సెప్ట్‌తో పర్యావరణహిత వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తూ ప్రజల్లో విశేష చైతన్యం కల్పిస్తున్నారు.
Ponnur: పంచభూతాల కాన్సెప్ట్‌తో రెల్లి కమిటీ వినూత్న గణపతి!
పొన్నూరు: పొన్నూరు రైల్ పేటలోని రెల్లి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వినూత్నంగా, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వినాయక చవితి మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. సంప్రదాయానికి భిన్నంగా, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే విధంగా విభిన్న రూపాల్లో వినాయకుని ప్రతిమలను ఏర్పాటు చేస్తూ రెల్లి కమిటీ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.
ప్రకృతిలోని పంచభూతాలైన నీరు, గాలి, అగ్ని, భూమి, ఆకాశం అనే ఐదు మూలకాలను ప్రతిబింబించేలా ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన ఆలోచనతో వినాయకుని రూపాన్ని ఏర్పాటు చేయడం రెల్లి కమిటీ ప్రత్యేకతగా నిలుస్తోంది. ఒక సంవత్సరం గాలి తత్వాన్ని ప్రతిబింబించేలా, మరో సంవత్సరం నీటి ప్రాధాన్యతను చాటేలా, అలాగే అగ్ని, భూమి, ఆకాశం వంటి పంచభూతాల గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా వినాయకుని రూపాలను రూపొందిస్తూ పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
వినాయక చవితి ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలకే పరిమితం కాకుండా, ప్రకృతిని కాపాడాలి.. పర్యావరణాన్ని పరిరక్షించాలి.. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలి అనే సందేశాన్ని అందించేలా రెల్లి కమిటీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రెల్లి కమిటీ రైల్ పేట వారి ఈ వినూత్న ఆలోచనలకు పొన్నూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల నుంచి విశేష ఆదరణ, ప్రశంసలు లభిస్తున్నాయి.




