Guntur: మలినేని కళాశాలలో ‘యువత భవితకు భరోసా’ సదస్సు!

Guntur: మలినేని ఇంజినీరింగ్ కళాశాలలో ‘యువత భవితకు భరోసా’ సదస్సు ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే బుర్లా రామాంజనేయులు ముఖ్య అతిథులు 2,000 మంది విద్యార్థుల భాగస్వామ్యం.

ANANDBABU,	PRATTIPADU
Published on: 29 Sept 2026 11:57 PM IST
Guntur
X

Guntur: మలినేని కళాశాలలో ‘యువత భవితకు భరోసా’ సదస్సు!

గుంటూరు: గుంటూరు వట్టిచెరుకూరు మండలం లో పుల్లడగుంట ,దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించే శక్తి యువతకే ఉందని రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ అన్నారు. మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాల (MLEW), పుల్లడిగుంటలో విద్యార్థినీ విద్యార్థుల కోసం ‘యువత భవితకు భరోసా’ పేరుతో మోటివేషనల్ అవేర్‌నెస్ సదస్సును మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే శ్రీ బుర్లా రామాంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘వికసిత్ భారత్’ లక్ష్యాలకు అనుగుణంగా యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, నైపుణ్యాలను పెంపొందించుకుని నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న పరిశ్రమలు, భవిష్యత్తులో రానున్న పారిశ్రామిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ప్రత్తిపాడు ఎమ్మెల్యే శ్రీ బుర్లా రామాంజనేయులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందన్నారు. నూతన పారిశ్రామిక విధానాల ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, అమరావతి రాజధాని నిర్మాణంతో భవిష్యత్తులో యువతకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ ఆధ్వర్యంలో పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి జరుగుతోందని పేర్కొన్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు విద్యార్థులు కళాశాల స్థాయి నుంచే సాంకేతిక, కమ్యూనికేషన్ మరియు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో వివిధ పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ఇతర ఆకర్షణీయమైన బహుమతులను అందజేశారు.

కార్యక్రమంలో మలినేని పెరుమాళ్లు, చైర్మన్, డాక్టర్ కె. వెంకటేశ్వరరావు, డైరెక్టర్, డాక్టర్ జె. అప్పారావు, ప్రిన్సిపాల్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సదస్సుకు సుమారు 2,000 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా హాజరై, అతిథులతో ముచ్చటిస్తూ యువత భవిష్యత్తు, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ, పారిశ్రామిక అవకాశాలపై అవగాహన పొందారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU