Repalle: తుఫాన్ ముప్పు నేపథ్యంలో రేపల్లె పోలీసుల ముందస్తు హెచ్చరికలు!

Repalle: తుఫాన్ ముప్పు దృష్ట్యా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి: రేపల్లె డీఎస్పీ అబ్దుల్ అజీజ్. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని, గొడవలు చేస్తే కఠిన చర్యలు.

VIJAYA KISHORE, REPALLE
Published on: 27 Oct 2026 1:16 PM IST
Repalle
X

Repalle: తుఫాన్ ముప్పు నేపథ్యంలో రేపల్లె పోలీసుల ముందస్తు హెచ్చరికలు!

Repalle: సైక్లోన్ (తుఫాన్) ముప్పు నేపథ్యంలో ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోందని, ప్రజలందరూ పోలీసు యంత్రాంగానికి సహకరించాలని రేపల్లె డీఎస్పీ అబ్దుల్ అజీజ్ కోరారు. తుఫాన్ సమయంలో గాలికి చెట్లు పడిపోయే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎక్కువ ప్రయాణాలు చేయవద్దని సూచించారు.

పూరి గుడిసెలలో నివసించే ప్రజలు తుఫాన్ షెల్టర్లు లేదా సచివాలయాల వద్ద ఏర్పాటు చేసిన వసతులకు వెళ్లాలని తెలిపారు.

చోడవరం, అడవిదేవులపల్లి, నిజాంపట్నం ప్రాంత ప్రజలు ఎంఆర్ఓ, రెవెన్యూ మరియు పోలీసు సిబ్బంది సహాయంతో షెల్టర్లలో తల దాచుకోవాలని కోరారు. ఇళ్ల చుట్టూ ఉన్న పూరి గుడిసెలలో ఉండేవారికి ఇబ్బందులు ఎదురైతే స్థానికులు మానవతా దృక్పథంతో వారికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని, ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును ప్రశాంతంగా, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా వినియోగించుకోవాలని చెప్పారు. ఎన్నికల సమయంలో అనవసర గొడవలకు పాల్పడితే తదుపరి చర్యలు ఉంటాయని, రౌడీషీట్లు కూడా ఓపెన్ చేయబడతాయని హెచ్చరించారు.

రేపల్లె ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసులకూ సహకరించాలని కోరారు.

VIJAYA KISHORE, REPALLE

VIJAYA KISHORE, REPALLE