Repalle: గూడవల్లిలో కృంగిన RM డ్రెయిన్ రెగ్యులేటర్!

Repalle: చెరుకుపల్లి మండలం గూడవల్లిలో RM డ్రెయిన్ రెగ్యులేటర్ కృంగివేత.. నీటి ప్రవాహానికి తీవ్ర ఇసుక కోత, అధికారుల తనిఖీ.

VIJAYA KISHORE, REPALLE
Published on: 10 Sept 2026 2:58 PM IST
Repalle
X

Repalle: గూడవల్లిలో కృంగిన RM డ్రెయిన్ రెగ్యులేటర్!

Repalle: రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం గూడవల్లి గ్రామంలో ఆర్.ఎం డ్రెయిన్ పై నిర్మించిన రెగ్యులేటర్ కృంగిపోయింది. ​నీటి ప్రవాహానికి ఇసుక నేల కోతకు గురై రెగ్యులేటర్ దెబ్బతిన్నట్లు గుర్తించిన అధికారులు. ​సంఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టిన ఇరిగేషన్ శాఖ అధికారులు.

​డయాఫ్రం వాల్ లేకపోవడం వల్లే తరచూ కోతకు గురవుతోందని రైతుల ఆవేదన. చెరుకుపల్లి మండలం గూడవల్లి గ్రామంలోని ఆర్.ఎం డ్రెయిన్ పై ఉన్న రెగ్యులేటర్ కోతకు గురై కృంగిపోయింది. సాగునీరు వృధాగా పోకుండా నిరోధించేందుకు గాను 2008వ సంవత్సరంలో ఈ డ్రెయిన్ పై రెగ్యులేటర్లను నిర్మించారు.

​అయితే, రెగ్యులేటర్ పరిసర ప్రాంతాల్లోని భూమి ఇసుక నేల కావడం వల్ల, కాలువలో నీటి ప్రవాహ వేగానికి నేల తీవ్రంగా కోతకు గురైంది. దీంతో రెగ్యులేటర్ పునాదులు దెబ్బతిని కృంగిపోయింది. సమాచారం అందుకున్న ఇరిగేషన్ అధికారులు, చెరుకుపల్లి తహసిల్దార్ సురేష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. నీటి ప్రవాహాన్ని అరికట్టేందుకు, తదుపరి నష్టం జరగకుండా ఉండేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

​డ్రెయిన్ వద్ద సరైన డయాఫ్రం వాల్ లేకపోవడం వల్లే ఈ ప్రాంతం తరచూ నీటి ప్రవాహానికి కోతకు గురవుతోందని, దీనికి శాశ్వత పరిస్కారం చూపాలని స్థానిక రైతులు అధికారులను కోరారు.

VIJAYA KISHORE, REPALLE

VIJAYA KISHORE, REPALLE

Next Story