Repalle: రేపల్లె: 154 మందికి రూ.1.23 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ
Repalle: రేపల్లె నియోజకవర్గంలో 154 మంది లబ్ధిదారులకు రూ.1.23 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పంపిణీ చేశారు.
Repalle: రేపల్లె: 154 మందికి రూ.1.23 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ
బాపట్ల జిల్లా రేపల్లె: అత్యవసర వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కొండంత భరోసా ఇస్తుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
రేపల్లె నియోజకవర్గం లోని వివిధ మండలాలకు చెందిన 154 మంది లబ్ధిదారులకు 1 కోటి 23 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి సత్య ప్రసాద్ పంపిణీ చేశారు.
ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వైద్య సహాయం త్వరితగతిన అందేలా చూస్తామన్నారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని మంత్రి తెలిపారు.




