Repalle: రేపల్లెలో రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి అనగాని
Repalle: హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద రేపల్లెలో రూ.30 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్.. వైసీపీ తీరుపై మండిపాటు.
Repalle: రేపల్లెలో రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి అనగాని
బాపట్ల జిల్లా, రేపల్లె: రేపల్లె లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్... పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం.
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పద్ధతి ద్వారా రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో రోడ్లు, మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి: మంత్రి అనగాని సత్యప్రసాద్.
ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా చంద్రబాబు నాయకత్వంలో పాలన. ప్రతి పట్టణంలోనూ ప్రాథమిక మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ, మెరుగైన రహదారుల నిర్మాణం. పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు.
విజయవాడలో గురువులపై రాళ్లు కరలతో దాడి చేసి దూషించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గురువుల పట్ల ప్రతిపక్ష పార్టీ ప్రవర్తించిన తీరు వారి సైకో తత్వాన్ని స్పష్టం చేస్తుంది. ఓటమి భారాన్ని తట్టుకోలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న పార్టీని రాష్ట్రం నుండి తరిమికొట్టాలి.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ప్రజలంతా భాగస్వాములు కావాలి. ప్రభుత్వం చేపడుతున్న పనుల నాణ్యతను క్షేత్రస్థాయి అమలు తీరును నిరంతరం పర్యవేక్షించవలసిన బాధ్యత అందరిపై ఉంది.
పరిపాలన మరింత మెరుగ్గా సాగేందుకు ప్రజలు ఇచ్చే విలువైన ఆలోచనలు సూచనలను ఎల్లప్పుడూ స్వాగతిస్తాం. నిర్ణీత సమయంలోనే అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు చర్యలు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో రూ.30 కోట్లతో పట్టణాభివృద్ధి: మంత్రి అనగాని సత్యప్రసాద్.
ఏపీలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పథకం ద్వారా రూ.30 కోట్లతో అభివృద్ధి పనులకు బృహత్తర అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని విమర్శించారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పట్టణాల స్వరూపాన్ని మార్చి, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. నాణ్యతతో కూడిన రహదారులు, తాగునీరు, పారిశుధ్యం తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.




