Repalle: స్వచ్ఛ సుందర రేపల్లే నా ధ్యేయం: కుర్రా అవర్ణ!

Repalle: రేపల్లె మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా కుర్రా అవర్ణ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. పట్టణాన్ని స్వచ్ఛ, సుందర రేపల్లెగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

VIJAYA KISHORE, REPALLE
Published on: 18 Oct 2026 6:12 PM IST
Repalle
X

Repalle: స్వచ్ఛ సుందర రేపల్లే నా ధ్యేయం: కుర్రా అవర్ణ!

రేపల్లె: రేపల్లె మున్సిపల్ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం ఆనందంగా ఉంది. రేపల్లె మున్సిపాలిటీ ఎన్నికల బరిలో వార్డు కౌన్సిలర్ లుగా అత్యధికంగా మహిళలకే ప్రాధాన్యత కల్పించారు. రేపల్లె పట్టణ ప్రజలందరి సహకారంతో రేపల్లె పట్టణాన్ని స్వచ్చ సుందర రేపల్లెగా మార్చడమే నా ధ్యేయం.

రేపల్లె పట్టణాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తూ పట్టణంలో అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించేలా నా వంతు కృషి చేస్తాను. మంత్రి అనగాని సత్యప్రసాద్ సహకారంతో ఇప్పటికే రేపల్లె చాలా అభివృద్ధి చెందింది.

రేపల్లె పట్టణంలో శానిటేషన్ కు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి.. ప్రతిరోజు ఒక వార్డుకు తిరుగుతూ పరిపూర్ణంగా సానిటేషన్ సమస్యను నిర్మూలిస్తాను.

VIJAYA KISHORE, REPALLE

VIJAYA KISHORE, REPALLE