Repalle: దళారీల చేతిలో మోసపోతున్న ఆక్వా రైతులు పీటా నాగమోహన్ కృష్ణ!

Repalle: ఆక్వా రైతుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ పీటా నాగమోహన్ కృష్ణ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి జూలై 15న చలో భీమవరం కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

VIJAYA KISHORE, REPALLE
Published on: 13 July 2026 5:45 PM IST
Repalle
X

Repalle: దళారీల చేతిలో మోసపోతున్న ఆక్వా రైతులు పీటా నాగమోహన్ కృష్ణ!

రేపల్లె: కోస్తా తీర ప్రాంతంలోని ఆక్వా రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం హయాంలో ఆక్వా రైతులు దళారీల చేతుల్లో మోసపోతున్నారని, ఆక్వా ఫీడ్ మరియు మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రేపల్లె నియోజకవర్గంలో దాదాపు 40 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుందని, దీనిపై లక్ష మందికి పైగా ఆధారపడి ఉన్నారన్నారు.గత వైసీపీ ప్రభుత్వంలో సచివాలయాల్లోనే ధరల వివరాలను ఉంచి పారదర్శకంగా వ్యాపారం జరిగేలా చూశారు.ప్రస్తుతం రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు.ఆక్వా రైతులకు మద్దతుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ నెల 15వ తేదీన జరిగే చలో భీమవరం కార్యక్రమానికి ఆక్వా రైతులందరూ తరలిరావాలి.

క్రెడిట్ చోరీ పై విమర్శలు.గత ప్రభుత్వంలో నిజాంపట్నంలో రూ. 450 కోట్లతో ఆక్వా పార్క్ మరియు హార్బర్ పనులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంజూరు చేశారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటి అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ, ఆ ప్రాజెక్టుల క్రెడిట్‌ను దొంగిలించడానికి ప్రయత్నిస్తోంది.

కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆక్వా పార్క్, హార్బర్ పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు మేలు చేయాలని వైసిపి ఇన్చార్జి పేట నాగమోహన్ కృష్ణ, నియోజకవర్గ పరిశీలకుడు అడపా శేషు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి యార్లగడ్డ మదన్మోహన్ గౌడ్ డిమాండ్ చేశారు.

VIJAYA KISHORE, REPALLE

VIJAYA KISHORE, REPALLE

Next Story