Prathipadu: పెదనందిపాడు టీడీపీలో బయటపడ్డ విభేదాలు.. మీ పక్కన కూర్చునే అర్హత లేదా!

Prathipadu: పెదనందిపాడు టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. మండలంలో బీసీలను చిన్నచూపు చూస్తున్నారని, తగిన గుర్తింపు ఇవ్వకుంటే సత్తా చూపుతామని వెంకట్రావు హెచ్చరించారు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 11 Nov 2026 6:17 PM IST
Prathipadu
X

Prathipadu: పెదనందిపాడు టీడీపీలో బయటపడ్డ విభేదాలు.. మీ పక్కన కూర్చునే అర్హత లేదా!

గుంటూరు జిల్లా: ప్రత్తిపాడు నియోజకవర్గ.. పెదనందిపాడు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అగ్రకులాలకు స్థానం ఉందని బీసీలకు స్థానం లేదని బీసీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకు కంచుకోట అని స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నారు. ఈ పార్టీలో బీసీలకు ప్రత్యేక గౌరవం ఉందని అన్నారు. దానికి వ్యతిరేకంగా పెదనందిపాడు మండలంలో బీసీలను చిన్నచూపు చూస్తున్నారన్నారు.

ఇప్పటికైనా బీసీలకు తగు గుర్తింపు ఇవ్వాలని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బిసి అధ్యక్షుడు వెంకటరావు హెచ్చరించారు. లేదంటే రానున్న రోజుల్లో బీసీల సత్తా ఏంటో చూపిస్తామన్నారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU