Chirala: సబ్‌జూనియర్ ఫుట్‌బాల్ జట్టు క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ
Chirala: ఎన్ఆర్ & పీఎం హైస్కూల్ మైదానంలో బాపట్ల జిల్లా సబ్‌జూనియర్ ఫుట్‌బాల్ జట్టు క్రీడాకారులకు రోటరీ క్లబ్ ఆఫ్ వేటపాలెం అధ్యక్షుడు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు.
Chirala: సబ్‌జూనియర్ ఫుట్‌బాల్ జట్టు క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ
చీరాల: విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రోటరీ క్లబ్ ఆఫ్ వేటపాలెం అధ్యక్షుడు డాక్టర్ ఉగ్గిరాల మార్కండేయులు అన్నారు. చీరాల ఎన్‌ఆర్ & పీఎం హైస్కూల్ క్రీడా మైదానంలో బాపట్ల జిల్లా సబ్‌జూనియర్ ఫుట్‌బాల్ జట్టు క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య వక్తగా పాల్గొన్న డాక్టర్ మార్కండేయులు మాట్లాడుతూ చిన్న వయసు నుంచే విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాలని సూచించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన, నాయకత్వ లక్షణాలతో పాటు జట్టు స్ఫూర్తిని పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన ఎంతోమంది క్రీడాకారులు సరైన ప్రోత్సాహం, అవసరమైన సౌకర్యాలు లేక వెనుకబడుతున్నారని, అలాంటి వారిని గుర్తించి ప్రోత్సహించేందుకు రోటరీ క్లబ్ తరఫున తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు.
బాపట్ల జిల్లా సబ్‌జూనియర్ బాలుర ఫుట్‌బాల్ జట్టు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు ఎన్‌టీఆర్ జిల్లా మైలవరంలో జరగనున్న అంతర్ జిల్లాల ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్–2026లో పాల్గొననుంది. ఈ నేపథ్యంలో జట్టు క్రీడాకారులకు డాక్టర్ మార్కండేయులు చేతుల మీదుగా క్రీడా దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మేరుగ ప్రభావతి, అసోసియేషన్ సభ్యులు బునిగల క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బాపట్ల జిల్లా జట్టుకు ఎంపికైన 15 మంది క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందజేసి, రాబోయే పోటీల్లో ప్రతిభ కనబరచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో బాపట్ల జిల్లా జట్టు విజయాలు సాధించాలని క్రీడాకారులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఐ. బాబురావు,ఫాస్ట్ ప్రెసిడెంట్ కొత్త వాసు, ఫాస్ట్ ప్రెసిడెంట్ కారం చేటి శివరామకృష్ణ, రోటరీ క్లబ్ ఆఫ్ వేటపాలెం సెక్రటరీ పోలకం చంద్రశేఖర్, ట్రెజరర్ అందే మురళీకృష్ణ, ఓట్ల వెంకటేశ్వర్లు (రొటీరియన్) తదితరులు పాల్గొన్నారు.




