Mangalagiri: జనసేన ఆఫీస్ పేరుతో రూ.7 కోట్ల జాబ్ స్కామ్!
Mangalagiri: మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్, నేతల పేర్లు వాడి ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో 20 మంది వద్ద రూ.7 కోట్లు వసూలు చేసిన వ్యక్తిపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Mangalagiri: జనసేన ఆఫీస్ పేరుతో రూ.7 కోట్ల జాబ్ స్కామ్!
Mangalagiri: మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన కళ్యాణం శివ శ్రీనివాసరావు (కె.కె) జనసేన పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మరియు కోటా రుక్మిణి..
మంగళగిరి జనసేన స్టేట్ పార్టీ ఆఫీస్ గుర్తులను వాడి 'కళ్యాణం శివ శ్రీనివాస్" పేరు మరియు "కోట రుక్మిణి" పేరు ఉపయోగించి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి గగరా ధరణి అనే వ్యక్తి ఏలూరు మరియు తణుకు ప్రాంతాలలో 20 మంది వద్ద మంచి ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ అయ్యాడు..
గగర ధరణి అనే వ్యక్తి గతంలో ఒక కన్సల్టెన్సీ జాబ్ ఏజెన్సీ ఆఫీసులో పని చేసేవాడు.. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాయకుల పేర్లు వాడి ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ సృష్టించి బాధితుల వద్ద నుంచి ఏడు కోట్ల రూపాయలు వసూలు చేశాడు..
ఈ ఘరానా మోసం జనసేన స్టేట్ పార్టీ ఆఫీస్ కి చేరడంతో కళ్యాణం శివ శ్రీనివాస్(k k) మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది..
మంగళగిరి రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




