Guntur: ఉపాధ్యాయులకు 'వన్-డే కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం'!
Guntur: ఆర్.వి.ఆర్ & జె.సి ఇంజినీరింగ్ కళాశాల ఏఐసీటీఈ ఐడియా ల్యాబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు వన్-డే కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం నిర్వహించారు.
Guntur: ఉపాధ్యాయులకు 'వన్-డే కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం'!
Guntur: పాఠశాల ఉపాధ్యాయుల కోసం “వన్-డే కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం” విద్యార్థులను భవిష్యత్ ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దేందుకు, తరగతి గదిని కేవలం పాఠ్య బోధనకు పరిమితం చేయకుండా “ఇన్నోవేషన్ స్పేస్” గా మార్చాల్సిన అవసరం ఉందని కళాశాల అధ్యక్షులు డా. రాయపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీ జాగర్లమూడి మురళీమోహన్, డా. జగదీష్ కె. మద్దినేని పేర్కొన్నారు.
స్థానిక చౌడవరంలోని ఆర్.వి.ఆర్. & జె.సి. ఇంజినీరింగ్ కళాశాల ఏ.ఐ.సీ.టీ.ఈ. ఐడియా ల్యాబ్ ఆధ్వర్యంలో గుంటూరు నగర, శివారు ప్రాంతాల్లోని పలు పాఠశాలల ఉపాధ్యాయుల కోసం “వన్-డే కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఇన్నోవేషన్, డిజైన్ థింకింగ్, ప్రోటోటైపింగ్, సమస్య పరిష్కార విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై నిపుణులు అవగాహన కల్పించడంతో పాటు ప్రాయోగిక అనుభవాన్ని అందించారు.
భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి విద్యార్థులను సిద్ధం చేసే దిశగా ఉపాధ్యాయుల సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడమే ఈ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం ప్రధాన లక్ష్యమని కళాశాల సెక్రటరీ & కరెస్పాండెంట్ శ్రీ రాయపాటి గోపాల కృష్ణ, ట్రెజరర్ డా.కొండబోలు కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.కొల్లా శ్రీనివాస్, కళాశాల అకడమిక్ అండ్ ఆర్&డి డైరెక్టర్ డా.కె.రవీంద్ర, కళాశాల డైరెక్టర్ ఫైనాన్స్ & అడ్మినిస్ట్రేషన్ డా.ఎన్.వి.శ్రీనివాసరావు, డా.కె.చంద్రశేఖర్, డా. కె.స్వర్ణశ్రీ , ఏఐసీటీఈ ఐడియా ల్యాబ్ నిపుణుల బృందం తదితరులు కలరు.




