Sattenapalli: సత్తెనపల్లిలో పోలీసుల రక్తదాన శిబిరం.. ఆదర్శంగా నిలిచిన సిబ్బంది
Sattenapalli: రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయం వద్ద పోలీసులు, పౌరులు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు.
Sattenapalli: సత్తెనపల్లిలో పోలీసుల రక్తదాన శిబిరం.. ఆదర్శంగా నిలిచిన సిబ్బంది
పల్నాడు జిల్లా: సత్తెనపల్లి రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకల్లో భాగంగా సత్తెనపల్లి సబ్ డివిజన్ పోలీస్ అధికారి కార్యాలయం వద్ద శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు.
పోలీసు సిబ్బంది, పౌరులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయవచ్చని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి డీఎస్పీ క్రిష్ణ చైతన్య ,సీఐ నాగమల్లేశ్వరరావు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




