Peddadornala: కెనాల్‌లో గల్లంతైన రాజ్‌కుమార్ కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాల తీవ్ర గాలింపు
Peddadornala: పెద్దదోర్నాల మండలం కటకానిపల్లి వద్ద వెలుగొండ ఫీడర్ కెనాల్‌లో గల్లంతైన రాజ్‌కుమార్ కోసం వారం రోజులుగా ఎస్డీఆర్ఎఫ్, పోలీసుల గాలింపు కొనసాగుతోంది.
Peddadornala: కెనాల్‌లో గల్లంతైన రాజ్‌కుమార్ కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాల తీవ్ర గాలింపు
మార్కాపురం జిల్లా: పెద్దదోర్నాల మండలంలోని కటకానిపల్లి సమీపంలో వెలుగొండ ఫీడర్ కెనాల్‌లో ఇద్దరు యువకులు గల్లంతైన ఘటనలో మరో యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి వారం రోజులు పూర్తవుతున్నా రాజ్‌కుమార్ జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే గల్లంతైన వినయ్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. అయితే రాజ్‌కుమార్ ఆచూకీ కోసం అధికారులు, పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. కెనాల్‌లో నీటి ప్రవాహం, లోతు ఎక్కువగా ఉండటంతో గాలింపు సవాలుగా మారింది. ఇటు పోలీస్ సిబ్బంది ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు అహర్నిశలు కృషి చేస్తున్న ఫలితం శూన్యంగా ఉంది
రాజ్‌కుమార్ ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేసి, తమ కుటుంబ సభ్యుడిని గుర్తించి అప్పగించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.




