Guntur: గుంటూరు DLSA ఆధ్వర్యంలో మధ్యవర్తులకు సమీక్షా సమావేశం!

Guntur: గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘దేశం కోసం మధ్యవర్తిత్వం 3.0’పై మధ్యవర్తులకు సమీక్ష, పారా లీగల్ వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 25 Sept 2026 11:31 PM IST
Guntur
X

Guntur: గుంటూరు DLSA ఆధ్వర్యంలో మధ్యవర్తులకు సమీక్షా సమావేశం!

గుంటూరు: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు క్యాలెండర్ ఆక్టివిటీస్ లో భాగంగా ఈ రోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో జిల్లా వ్యాప్తంగా మధ్యవర్తులందరికీ సెన్సిటైజేషన్ మరియు రివ్యూ మీటింగ్ మరియు పారా లీగల్ వాలంటీర్స్ కు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్.

ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ దేశం కోసం మధ్యవర్తిత్వం 3.0 లో భాగంగా పెండింగ్ లో ఉన్న కేసులలో సెటిల్మెంట్ ఎలిమెంట్ ఉన్న కేసులను గుర్తించడం, ప్రీ మీడియేషన్ స్క్రీనింగ్ నిర్వహించడం, ఇరుపక్షాలకు నోటీసులు ఇవ్వడం,

మీడియేషన్ కు అనుకూలమైన కేసులను మీడియేషన్ కి రిఫర్ చేయడం ,అవేర్నెస్ మరియు ఔట్ రీచ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం మరియు రిఫర్ చేసిన కేసులను నిర్దేశిత ఫార్మాట్ లో ఫిల్ చేయడం మరియు తదుపరి కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని మీడియేషన్ అనేది ఒకరోజు కార్యక్రమం కాదని ఒక నిరంతర ప్రక్రియ అని, మీడియేషన్ లో మధ్యవర్తుల పాత్ర చాల ముఖ్యమైనదని ఒక మంచి సెటిల్మెంట్ అంటే కేవలం ఒక కేసు ముగియడం కాదని ఒక వివాదం వెనుక ఉన్న సంబంధాలను,

భవిష్యత్ ప్రయోజనాలను మరియు మానవీయ అంశాలను పరిగణనలోకి తీసుకొని, ఇరు పక్షాలు స్వచ్ఛందంగా అంగీకరించిన పరిష్కారానికి చేరుకోవడమే నిజమైన మధ్యవర్తిత్వం అని . అందువల్ల, మధ్యవర్తిత్వం3.0 విజయవంతం కావడంలో మన మధ్యవర్తుల పాత్ర అత్యంత కీలకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ ఆన్ చైల్డ్-ఫ్రెండ్లీ మీడియేషన్ ప్రాసెస్ ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం.

"బాలల అనుకూల మధ్యవర్తిత్వ ప్రక్రియపై మధ్యవర్తులకు అవగాహన మరియు సున్నితత్వ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం.” ఇది కేవలం క్యాలెండరు ఆక్టివిటీస్ లో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేయడం మాత్రమే కాదని ఇది కుటుంబ వివాదాల మధ్య చిక్కుకుపోయిన పిల్లల భవిష్యత్తును, వారి మానసిక ప్రశాంతతను,

వారి హక్కులను మరియు వారి గౌరవాన్ని కాపాడేందుకు మనం తీసుకునే ఒక ముఖ్యమైన అడుగు అని ఈ కార్యక్రమం ద్వారా మనం మధ్యవర్తులకు కేవలం కొత్త విధానాలను తెలియజేయడమే కాకుండా బాలల సమస్యలను బాలల దృక్కోణంలో అర్థం చేసుకునే మానవీయ దృష్టిని మరింత బలోపేతం చేయడం మన ప్రధాన లక్ష్యం అని అన్నారు. మరియు బాలల అనుకూల మధ్యవర్తిత్వం ఎందుకు అవసరం,మధ్యవర్తిత్వం అంటే ఏమిటి.

బాలల అనుకూల మధ్యవర్తిత్వం అంటే ఏమిటి బాలల సంక్షేమమే ప్రధాన అంశంగా ముఖ్యంగా పిల్లలతో కూడిన వివాదాలలో మధ్యవర్తి పాత్ర మరింత సున్నితమైనదని ఇలాంటి వివాదాలలో నిష్పక్షపాత వైఖరి,నమ్మకమైన వాతావరణం, పిల్లలను వివాద సాధనంగా ఉపయోగించకుండా చూడటం పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మధ్యవర్తులకు విపులంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో పర్మినెంట్ లోక్ అదాలత్ ఛైర్మెన్ పి . వి . రాజీవ్ మాట్లాడుతూ మధ్యవర్తిత్వం పై మధ్యవర్తులకు మరింత అవగాహన కల్పించారు. చిన్న చిన్న ఉదాహారణలతో సివిల్ మరియు క్రిమినల్ కేసులలో మరియు కుటుంబ వివాదాల కేసులలో ఎలాంటి చర్యలు తీసుకుంటూ మధ్యవర్తిత్వం చేయాలో విపులంగా వివరించారు. మధ్యవర్తులకు ఉన్న అనుమానాలకు తగు సలహాలు , సూచనలు ఇచ్చారు.

ఇదే రోజు పారా లీగల్ వాలంటీర్స్ కు ట్రైనింగ్ ప్రోగ్రాం ను నిర్వహించారు . ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ . పారా లీగల్ వాలంటీర్స్ ప్రజలకు మరియు న్యాయ వ్యవస్థకు మధ్య ఒక ముఖ్యమైన వారధి లాంటి వారని,

ప్రత్యేకంగా సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు తమ హక్కుల గురించి పూర్తిస్థాయిలో అవగాహన లేని వారికి పారా లీగల్ వాలంటీర్స్ పాత్ర అత్యంత ముఖ్యమైనదని ముఖ్యంగా మహిళల హక్కులు మరియు వారి రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన , డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ , పోక్సో చట్టం,జువినైల్ జస్టిస్ యాక్ట్ , బాధితులకు అందే పరిహార చట్టం వంటి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

నష్టపోయే అవకాశం ఉన్న బాధితులను గుర్తించడం మరియు సిఫార్సు చేయడం ఈ రోజు అంశంలో ముఖ్య భాగమని బాధితులను గుర్తించి వారికి సరైన న్యాయాన్ని అందుబాటులో ఉండేలా పారా లీగల్ వాలంటీర్స్ కృషి చేయాలనీ అన్నారు.

ఈ కార్యక్రమంలో పర్మినెంట్ లోక్ అదాలత్ ఛైర్మెన్ పి. వి. రాజీవ్ మాట్లాడుతూ సమాజంలో ప్రజలకు దగ్గరగా ఉండి న్యాయం అవసరమైన వారికి చట్టపరంగా సలహాలు సూచనలు ఇచ్చి వారికి తగు న్యాయం అందించడంలో పారా లీగల్ వాలంటీర్స్ పాత్ర చాలా ముఖ్యమైనదని అన్నారు. కొన్ని కేసుల ఉదాహారణలతో పారా లీగల్ వాలంటీర్స్ కు ప్రజలకు న్యాయ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో విపులంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ కట్ట కాళిదాసు పారా లీగల్ వాలంటీర్స్ కు తగు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మధ్యవర్తులు , పారా లీగల్ వాలంటీర్స్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ స్టాఫ్ పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN