Vinukonda: వినుకొండలో తాగునీటి సమస్యకు చెక్
Vinukonda: చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆదేశాలతో సింగర చెరువుకు సాగర్ జలాలు.. మున్సిపల్ కమిషనర్ శివరాం ప్రసాద్ వెల్లడి.
Vinukonda: వినుకొండలో తాగునీటి సమస్యకు చెక్
వినుకొండ: పురపాలక సంఘం పరిధిలో వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ శివరాం ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు సాగర్ జలాలను పూర్తిస్థాయిలో సింగర చెరువుకు తరలించి నింపినట్లు ఆయన వెల్లడించారు.
పట్టణ ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించడమే లక్ష్యంగా అధికారులు ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నారని చెప్పారు. నీటి నిల్వలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవడంతో రానున్న రోజుల్లో కూడా నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.
ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఏదైనా ప్రాంతంలో నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలు తలెత్తినట్లయితే వెంటనే పురపాలక సంఘం అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ శివరాం ప్రసాద్ స్పష్టం చేశారు.




