Guntur: మేయర్ లక్ష్మీ అపర్ణకు విభిన్న ప్రతిభావంతుల శుభాకాంక్షలు

Guntur: గుంటూరు నగర మేయర్‌గా ఎన్నికైన లక్ష్మీ అపర్ణ కోవెలమూడిని విభిన్న ప్రతిభావంతులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 6 Nov 2026 3:17 PM IST
Guntur
X

Guntur: మేయర్ లక్ష్మీ అపర్ణకు విభిన్న ప్రతిభావంతుల శుభాకాంక్షలు

గుంటూరు: గుంటూరు నగర మేయర్‌గా విజయం సాధించిన లక్ష్మీ అపర్ణ కోవెలమూడి ని అభినందించేందుకు విభిన్న ప్రతిభావంతులు మేయర్ కార్యాలయానికి విచ్చేసి, పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారిని ఆప్యాయంగా పలకరించిన అపర్ణ, వారి ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, ముఖ్యంగా ‘ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం’ ద్వారా పెంచిన పింఛన్లను గుర్తుచేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని, వారికి అవసరమైన సౌకర్యాలు, సమాన అవకాశాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN