Chirala: ఉన్నత చదువులకు ‘శ్రీ తులసి’ ట్రస్ట్ ఆర్థిక చేయూత..

బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ పరిధిలోని నిరుపేద విద్యార్థులకు 'శ్రీ తులసి' ట్రస్ట్ 'కేతన కెరియర్ సొల్యూషన్స్' సంయుక్త ఆధ్వర్యంలో 'విద్యాప్రదాత' పథకం

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 Jun 2026 1:31 PM IST
Chirala
X

Chirala: ఉన్నత చదువులకు ‘శ్రీ తులసి’ ట్రస్ట్ ఆర్థిక చేయూత..

చీరాల: ప్రముఖ ఎడ్యుకేషనల్ గైడెన్స్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ "శ్రీ తులసి" వారు మరియు "కేతన కెరియర్ సొల్యూషన్స్" వారి సంయుక్త ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థినీ, విద్యార్థులకు "విద్యాప్రదాత" పథకం ద్వారా స్కాలర్షిప్లు మంజూరు చేయడం జరుగుతుందని శ్రీ తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ అండ్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కర్పూరపు మురళీకృష్ణ అన్నారు.

నిరుపేద కుటుంబానికి చెంది చదువులో ఉన్నత స్థానం సాధిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులు పాలిటెక్నిక్, బిటెక్, ఎల్ఎల్బి, డిఫెన్స్, ఎంబీఏ, ఎంసీఏ, మరియు ఎంటెక్ లో చేరి విద్యను అభ్యసించాలని బలమైన కోరిక కలిగిన వారు తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంజూరు చేయు స్కాలర్షిప్ లకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.

జులై 4వ తేదీ లోపు తమ దరఖాస్తులను ఈ కింది నెంబర్ కు 79930 85349 ఫోన్ ద్వారా గాని వాట్సప్ ద్వారా గాని వివరాలను పంపి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు.

అర్హులైన వారందరికీ తమ ట్రస్ట్ ద్వారా ఎప్పటిలాగా తగిన సహాయం చేయడం జరుగుతుందని మురళీకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story