Vinukonda: వినుకొండలో సూపర్ స్టార్ కృష్ణ జయంతి

Vinukonda: సురేష్ మహల్ థియేటర్ వద్ద కృష్ణ, మహేష్ బాబు అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు.

KAREEMULLA, VINUKONDA
Published on: 31 May 2026 5:32 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో సూపర్ స్టార్ కృష్ణ జయంతి

వినుకొండ: ఆదివారం సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతి కార్యక్రమాన్ని అభిమానుల మధ్య నిర్వహించారు. పట్టణంలోని సురేష్ మహల్ థియేటర్ వద్ద కృష్ణ, మహేష్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడు, 5వ వార్డ్ మాజీ కౌన్సిలర్ పీవీ సురేష్ బాబు ఆధ్వర్యంలో అభిమానులు కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ సురేష్ బాబు మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారని తెలిపారు. చారిత్రక పాత్రల్లో ఆయన నటన ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిందన్నారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు పాత్రలో కృష్ణ చేసిన నటన ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉందని పేర్కొన్నారు . సినీ రంగంలో కొత్త సాంకేతికతలను పరిచయం చేయడంలో కూడా కృష్ణ ముందుండేవారని కొనియాడారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story