Tadepalli: రోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న మంత్రి మండిపల్లి
Tadepalli: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రతి రోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యలు తీరుస్తున్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
Tadepalli: రోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న మంత్రి మండిపల్లి
తాడేపల్లి: ప్రజలకు మరింత చేరువగా ఉండి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టే లక్ష్యంతో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రతి రోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, వివిధ వర్గాల ప్రతినిధులు హాజరై తమ సమస్యలను మంత్రిగారి దృష్టికి తీసుకువస్తున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విని, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నారు.
Next Story




