Tadepalli: తాడేపల్లిలో పోలీసుల అర్ధరాత్రి తనిఖీలు

Tadepalli: గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వరకు విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు.

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI
Published on: 19 July 2026 11:09 AM IST
Tadepalli
X

Tadepalli: తాడేపల్లిలో పోలీసుల అర్ధరాత్రి తనిఖీలు

Tadepalli: ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని మరియు రోడ్డు ప్రమాదాలను నివారించే లక్ష్యంతో తాడేపల్లి పోలీసులు నిన్న రాత్రి ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. తాడేపల్లి సీఐ వీరేంద్ర బాబు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ తనిఖీలు రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు కొనసాగాయి.

ఈ సందర్భంగా సీఐ వీరేంద్ర బాబు మాట్లాడుతూ ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించామని తెలిపారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు సరైన పత్రాలు మరియు అవసరమైన అనుమతులు లేకుండా వాహనాలను నడుపుతున్న వారిని గుర్తించామని పేర్కొన్నారు.

నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై కఠినంగా వ్యవహరిస్తూ సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేశామని ఆయన వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని దీని వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని సీఐ సూచించారు.

రోడ్డు భద్రతను పెంపొందించడం అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం మరియు నిబంధనల అమలులో భాగంగా రానున్న రోజుల్లో కూడా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.

వాహనదారులు ఎల్లప్పుడూ తమ వాహన ధ్రువీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని మరియు ట్రాఫిక్ నియమాలను పాటించి పోలీసులకు సహకరించాలని తాడేపల్లి సీఐ వీరేంద్ర బాబు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI

Next Story